

జల్ తుపాన్ తాకిడికి కోస్తా, రాయ లసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈశాన్య రుతుప వనాల ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లోనే తిరిగి జల్ తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘జల్’ తుపాను సాధారణ తుపానుగా బలహీనపడినప్ప టిీ నెల్లూరు జిల్లాలో ప్రజలు ఇంకా భయం గుప్పిట్లోనే ఉండటం తో. ప్రభుత్వం వారిని సహాయకశిబిరాలకు తరలిస్తుంది.ఈ తుపాన్ కారణంగా ఒక్క నెల్లూరు జిల్లాలోనే 15మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు సుమారు 10,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినటుల జిల్లా యం త్రాంగం వెల్లడించారు.జిల్లా వ్యాప్తంగా చెరువుల అన్నీ నిండి పోయి ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి.జల్ ప్రభావంతో నెల్లూ రు-గూడూరుల మధ్య రైళ్ల వేగాన్ని 50కి.మీలకు నియం త్రించినట్లు అధికారులుతెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు ఓ మోస్తరు నుంచి భారీగానే వర్షాలు నమోదయ్యాయి. మధ్య మధ్యలో వర్షం తెరపినప్పటికీ తిరిగి జల్లులతో కూడిన వర్షాలు పడ్డాయి. కృష్ణాజిల్లా తీర ప్రాంత గ్రామాల్లో ఈ వర్షాలు అలజడి సృష్టించాయి. ఆటుపోట్లు అధికంగా ఉండటంతో పాటు భారీ వర్షాల కారణంగా సముద్రంలో కలిసే డ్రైన్లలోని నీరు ఎదురు తన్నటంతో తీర ప్రాంత గ్రామాల్లో సముద్రపు నీరు గ్రామాన్ని తాకింది.
చిత్తూరులో సముద్ర తీరానికి సమీపంలో వున్న నిరుపేదలు నిర్మించుకున్న పూరిగుడిసెలు తుపాను గాలికి ఎగిరిపోయా యి. అలల ఉధృతి కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని బారువ- కొత్తూరు తీర ప్రాంతంలో పది అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది. అయితే ఈ జిల్లాల్లోని లోత ట్టు ప్రాం తాల ప్రజలను ముందుస్తు చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతా లకు తరలించడంతో ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. పెను తుపాను ప్రభా వంతో ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లోని పలు మండ లాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు ఉధృతమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఆదివారం రాత్రికి తీరం దాటుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు కాలం గడుపు తున్నారు. గుంటూరు, పశ్చిమగోదావరిజిల్లా జల్ తుపాన్ ప్రభావం అతంతమాత్రమే కనిపించింది. సముద్రంలో అలజడి కొనసాగుతుంది. జల్ తుపాన్ ప్రభావం వివరాలు జిల్లాల వారీగా..
తెల్లారేదాకా నెల్లూరు జిల్లా ప్రజలకు తప్పని ముప్పు

ముఖ్యంగా గూడూరు డివిజన్‌లోని తీరప్రాంత గ్రామాల్లోనూ, పులికాట్ సరస్సు సమీపంలోనూ సముద్రపు అలల తాకిడి ఎక్కువ గా ఉంది.ఇందుకూరుపేట, కోట, అల్లూరు, టీపీ గూడూరు మండ లాల పరిధిలోని తీరప్రాంత గ్రా మాల్లో సముద్రం 20 నుంచి 30 మీటర్ల వరకూ ముందుకు వచ్చిం ది. పులికాట్ సరస్సు సమీపం లోని జాలర్ల బోట్లు, వలలు దెబ్బ తిన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.ఆదివారం సాయంత్రం నుంచి జిల్లాలో జల్ తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం ఉదయం నుంచే జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. నెల్లూరు-చెనై్నల నడుమ తుపాను తీరం దాటనుందనే సమాచారంతో అధికారులు ఈ రెండు ప్రాంతాల నడుమ ఉన్న తుపాను ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
కృష్ణపట్నం ఓడరేవులో ఆదివారం ఉదయం 10నెంబరు అతిప్రమాద సూచికను ఎగరవేసిన అధికారులు సాయంత్రా నికి తీవ్రత తగ్గడంతో 7వ నెంబరు సూచికను ఎగరవేశారు. జిల్లావ్యాప్తంగా తీరప్రాంత, లోతట్టు ప్రాంతాలకు చెందిన 9,500 మందిని 34 పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి భోజన, వసతి సౌకర్యాలను కల్పించారు. జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జిల్లా కేంద్రంలోనే ఉంటూ కాన్ఫెరెన్స్ ద్వారా అధికారులకు పలు సూచనలు, సలహాలు అందిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాకు ప్రత్యేకాధికారిగా ప్రభు త్వం నియమించిన మార్క్‌ఫెడ్ ఎండీ చేరుకుని మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు అధికారులతో సమీక్షించి పలు సూచనలు అందచేశారు. మరోవైపు పోలీస్ అధికారులు సముద్ర తీర ప్రాంతాల్లో పికెట్‌లు వేసి ప్రజల ఆస్తిపాస్తులకు రక్షణ చర్యలు చేపడుతున్నారు. కటక్ నుంచి జాతీయ విపత్తు రక్షణ దళం రెండు రోజులు ముందుగానే జిల్లాకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. జిల్లాలోని 12 తీర ప్రాంత మండలాలకు జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ ప్రత్యేకాధికారులను నియమించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
తూర్పులో ఈదురు గాలులు - మోస్తరు వర్షం

ఈ వర్షాల వల్ల జిల్లాలోని 2లక్షల 50వేల ఎకరాల్లో పంట నష్టాలు జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. లక్షా 75 వేల కుటుంబాలు ముంపు బాధితులుగా గుర్తించారు. వారికి సోమవారం నుంచి 20 కేజీల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్ అందజేస్తారు. కోనసీమలో రెవెన్యూ యంత్రాంగం పునరావా స కేంద్రాలు ఏర్పాటుచేసిన దాఖలాలు లేవు.
కృష్ణా సముద్రంలో అలజడి

దివిసీమలో 1977 సం నవంబరులో సంభవించిన ఉప్పెన వలన 30 వేల మం ది ప్రజలు జలసమాధయ్యారు. ఈ నేపథ్యంలో జల్ తుఫాను ఏక్షణంలోనైనా జిల్లాను తాకుంతుదేమోనని ప్రజలు భయ భ్రాంతులవుతున్నారు. కృష్ణాజిల్లాలో నాగాయలంక, అవని గడ్డ, బందరు రూరల్, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండ లాలలో ఎక్కువ శాతం తీరప్రాంత గ్రామాలు ఉండ టంతో ఇప్పటికే జిల్లా రెవిన్యూ యంత్రాంగం 8 పునరావాస కేంద్రాల ను ఏర్పాటుచేసి సుమారు 2 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ జిల్లా అంతా వాతావరణం ప్రశాంతం గా ఉంది. ఎటువంటి వర్షం ఇంత వరకూ పడలేదు. అక్కడక్కడ చిన్నచిన్న చినుకులు మినహా పెద్దగా వర్షం నమోదు కాలేదు. తుఫాను పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా గతంలో పనిచేసిన బి.ఆర్ మీనా ఆదివారం బందరు చేరుకున్నారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామ వాసి నడకుదిటి రామన్న చేపల వేటకు వెళ్ళి మృతిచెందాడు. ఓర్లగొందితిప్ప గ్రామంలో ఓ వృద్ధురాలు చలికి తట్టుకోలేక మృతిచెందింది. రాష్ట్ర పశుసం వర్థక శాఖా మంత్రి కొలుసు పార్థ సారధి ఉదయం నుంచి తీర ప్రాంత గ్రామాలైన కృత్తివెన్ను, లక్ష్మీపురం, బంటుమిల్లి ప్రాంతా ల్లో పునరావాస కేం ద్రాలను పరిశీలించారు.
తడిసి ముద్దైన చిత్తూరు

ఇందులో పాక్షికంగా కూడా కొన్ని ఇండ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఆర్‌డిఒ కార్యాలయంలో తుఫాన్ ప్రభావంపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న ఇండ్లకు ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. కాళహస్తి పరిధిలో మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తిరుపతిలో వర్షం కారణంగా విద్యుత్ వైర్లు తెగి నాగార్జున అనే విద్యార్థి మృతిచెందాడు. కరకంబాడి వద్ద 30 ఎకరాల అరటి తోట ధ్వంసం అయ్యింది. నేడు జిల్లాలో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. జల్ తుపాన్ ప్రభావం జిల్లా అంతటా ఉన్నప్పటికీ తూర్పు మండలాల్లో అధికంగా ఉంది. రబిలో విత్తిన వరిపైరు పూర్తిగా నీట మునిగింది. తూర్పు మండలాల్లో ని పలు గిరిజన కాలనీలు జలమయమయ్యాయి.
‘జల్’దరించిన ఉత్తరాంధ్ర


అయితే బోటులో వున్న ఒక మత్స్యకారుడు మాత్రం మృత్యువాత పడ్డాడు. మిగిలిన వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నగరం లోని ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న కుండపోత వర్షా నికి నగరంలోని ఒక వస్త్ర దుకాణం పూర్తిగా నేలకొరి గింది. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. అదే విధంగా కంచరపాలెం, గాజు వాక ,పారిశ్రామిక ప్రాంతాల్లోని కొండ వాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందస్తు చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. అయితే మరో రెండు రోజులు ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు వున్న దృష్య్ట వారిని ప్రత్యేక శిబిరాల్లో వుండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
‘ప్రకాశం’ బిక్కుబిక్కు

ఉదయం ఏడు గంటల సమయంలో ప్రాజెక్టులో నీటి మట్టం 18.8 అడుగులు చేరుకుంది. సాయంత్రం 5 గంటల నుంచి సింగరాయకొండ, కందుకూరు, ఉలవపాడు, లింగసముద్రం, గుడ్లూరు మండలాల్లో భారీ వర్షంతో పాటు చలితో కూడిన ఈదురు గాలులు బలంగా వీశాయి. తీరం వెంబడి సముద్రం ఒడ్డు సుమారు ఏడు మీటర్లు కోతకు గురికాక, మరికొన్ని చోట్ల 30 నుంచి 50 మీటర్ల మేర ముందుకు వచ్చింది.