వాతావరణ నిపుణుల అనుమానం.. ముందే అప్రమత్తం కావాలని సూచన
అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో వాయుగుండం
బంగాళాఖాతంలో బలంగా ఉన్న వాయుగుండం సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం
రెండు, మూడ్రోజుల్లో రాష్ట్రం వైపు... కోస్తాంధ్రపై పెను ప్రభావం
దీపావళి నాటికి ప్రతాపం చూపే ప్రమాదం... ఇదే జరిగితే భారీగా నష్టం
1977లో దివిసీమ ఉప్పెనకు సూపర్ సైక్లోనే కారణం

రెండు, మూడ్రోజుల్లో రాష్ట్రం వైపు వచ్చే అవకాశం

రాష్ట్రానికి తుపాను రూపంలో పెనుగండం పొంచి ఉందా..? ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనంతో అతలాకుతలమవుతున్న రాష్ట్రానికి మరో ముప్పు ముంచుకొస్తోందా..? దివిసీమను వణికించిన భయంకర పరిస్థితులు కోస్తాంధ్రలో మళ్లీ పునరావృతం కానున్నాయా..? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రానికి ‘సూపర్ సైక్లోన్’ ముప్పు ఉందని పేర్కొంటున్నారు. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ వద్ద అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో ఏర్పడ్డ వాయుగుండం తీరుతెన్నులను బట్టి వీరు ఈ అంచనాకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ వాయుగుండం ముందుకు కదిలి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న అల్పపీడనంలో విలీనమైంది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ పెను తుఫాన్‌కు ‘జల’ అని నామకరణం చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. తుఫాను మనరాష్ట్రం వైపు రావడానికి మరో రెండు, మూడు రోజుల సమయం పట్టనుంది. అంటే దీపావళి (ఈ నెల 5) నాటికి ప్రతాపం చూపడం ఆరంభిస్తుందన్నమాట! ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో బలంగా ఉంది. దీని కదలికను బట్టి తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల వైపు దూసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వాయుగుండం పరిస్థితిని అంచనా వేస్తున్న వాతావరణ శాస్తవ్రేత్తలు ఇది ‘సూపర్ సైక్లోన్’గా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే 1999 నవంబర్‌లో ఒరిస్సాలో సంభ వించిన పరిస్థితులు తలెత్తవచ్చని భావిస్తున్నారు. 1999 అక్టోబర్ 25న ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర తుఫానుగా, అనంతరం సూపర్‌సైక్లోన్‌గా బలపడి నవంబర్ మూడో తేదీ వరకూ ప్రతాపం చూపింది. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. ఈ బీభత్సానికి ఒరిస్సాలో 15 వేల మంది దుర్మరణం పాలయ్యారు. 1977 నవంబర్‌లో దివిసీమ ఉప్పెనకు కూడా సూపర్ సైక్లోనే కారణం. అయితే ప్రస్తుతం అంతటి తీవ్రత దీనికి లేకున్నా రానున్న ప్రమాదాన్ని తక్కువగా చూడలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సాధారణంగా ఎలాంటి ప్రభావం చూపని అల్పపీడనద్రోణి, ఉపరితల ఆవర్తనాలతోనే ఈశాన్య రుతుపవనాలు రెచ్చిపోయి కుంభవృష్టి వర్షాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అలాంటిది రుతుపవనాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్న తరుణంలో వచ్చే పెను తుపానుతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. తుపాను ప్రభావంతో పలుచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి గంటకు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు తోడుకానున్నాయి. మరోవైపు ఈ పెనుతుపాను వారం రోజుల్లో తమిళనాడుకు ఉత్తరంగా, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతాన్ని తాకుతుందని స్కైమెట్ అంచనా వేస్తోంది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో అనేకచోట్ల రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండిపోయాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పుడు కొద్దిపాటి భారీ వర్షాన్ని కూడా భరించే స్థితిలో ఇవి లేవు. ముందున్న ముప్పును అంచనా వేసిన ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌లను ఈ నెల 9 వరకూ కొనసాగించాలని ఆదేశించింది. తుపాను ప్రభావం చూపడానికి ఇంకా రెండు, మూడు రోజుల సమయం ఉండటంతో పూటుగా నిండిన చెరువులు, కరకట్టల గట్టులను యుద్ధ ప్రాతిపదికన పటిష్టం చేయాల్సిన అవసరాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. తాగునీటిని, మందులను నిల్వ చేయాలని ఆంధ్రా వర్సిటీ వాతావరణం, సముద్ర అధ్యయన విభాగపు గౌరవ ప్రొఫెసర్ ఒ.ఎస్.ఆర్.యు.భానుకుమార్ సూచించారు.
సూపర్ సైక్లోన్ అంటే..?
వాతావరణంలో అల్పపీడన ద్రోణి నుంచి సూపర్ సైక్లోన్ ప్రస్థానం మొదలవుతుంది. ద్రోణి బలపడి అల్పపీడనంగా మారుతుంది. అది వాయుగుండంగాను, తీవ్ర వాయుగుండంగానూ రూపాంత రం చెందాక తుఫాను అవుతుంది. ఇది బలపడితే తీవ్ర తుఫాను, మరింత తీవ్రమైతే సూపర్ సైక్లోన్‌గా మారుతుంది. అల్పపీడనంగా ఉన్నప్పుడు గాలుల వేగం గంటకు 30 కిలోమీటర్ల లోపు, వాయుగుండంగా మారితే 30-49 కిలోమీటర్లు, తీవ్రవాయుగుండానికి 50-61, తుఫానుకు 62-87, తీవ్ర తుఫానుకు 88- 117, అతి తీవ్ర తుపానుకు 118-220, సూపర్ సైక్లోన్‌కు 222 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఆ సమయంలో పక్కా ఇళ్లు, భారీ వృక్షాలు కూడా నేలమట్టమవుతాయి. 20 సెం.మీలకు పైగానే వర్షపాతం నమోదవుతుంది. సూపర్ సైక్లోన్ సమయంలో సముద్రంలో అలల ఉధృతి 14 మీటర్లకు పైనే ఉంటుంది.

No comments:
Post a Comment