ఇంక ఈర్ష్య, పోటీ ఎందుకు?
ఏఎన్నార్‌తోనే సౌలభ్యంగా ఉండేది
జగన్ వెంటే ఉంటా.. జీసస్‌ను చూశా...
- జయసుధ
ఏఎన్నార్‌తోనే సౌలభ్యంగా ఉండేది
జగన్ వెంటే ఉంటా.. జీసస్‌ను చూశా...
- జయసుధ
సినీ వినీలాకాశంలో ఆమె సహజనటి... ఇప్పు డు రాజకీయాల్లోకి వచ్చాక ఆ స్థాయిలో నటించలేకపోతున్నానని చెబుతున్నారు. ఇక్కడ అంతకంటే సహజ నటులున్నారని అంటున్నారు. తాను ఏదీ ప్రణాళిక ప్రకారం చేయలేదని, నటిగా అయినా, ఇప్పుడు ఎమ్మెల్యేగా మారినా అన్నీ అనుకోకుండా జరిగినవేనని పేర్కొన్నారు. తనకు టెన్నిస్ ఆడాలనే కోరిక మాత్రం ఇప్పటి దాకా తీరలేదంటున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే, నటి జయసుధ ...
సినీ, రాజకీయ జీవితాల మధ్య తేడా ఎలా ఉంది?
రాజకీయాల్లో ఇంకా ఇమడలేదు. ప్రతి రోజూ ఏదో ఒక విషయం తెలుసుకుంటూనే ఉన్నాను. కొన్ని రాజకీయ చిత్రాల్లో చూసినప్పుడు నిజంగా అలా ఉంటుందా అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే దాదా పు అలాగే ఉంది. అంత మెలో డ్రామా కాకపోయినా దాదాపు 75% అలాగే ఉంది. సినిమాల్లో నటించేంత తేలిక కాదంటే... రాజకీయాలను అలా మార్చేశా రు. మన చేతిలో ఏమీ లేదు. త ప్పు మనది కాకపోయినా మన ల్నే అడుగుతారు. అయితే, ప్రజ లు ఎన్నుకున్నందున వాటిని ఎ దుర్కొనేందుకు సిద్ధపడాల్సిందే.
క్రైస్తవ మతం ఎందుకు తీసుకున్నారు?
1985లో బ్యాంకాక్‌లో ప్రమాదానికి గురైనప్పుడు జీసస్‌ను తలచుకున్నాను. అప్పటి నుంచి అలా నమ్మకం ఏర్పడింది. ఏసును అప్పుడు నేను చూశాను. ఏసుక్రీస్తుతో మనసులో మాట్లాడుతూనే ఉంటాను. 2001లో మతం పుచ్చుకున్నాను.
రాజకీయాల్లో మీకంటే సహజ నటులు తారసపడి ఉంటారు?
అబ్బో చాలామంది ఉన్నారండీ. చాలా సన్నివేశాల్లో నేను అవాక్కయిపోయాను కూడా. మన దగ్గర ఒకలా మాట్లాడి, వేరే చోట ఇంకోలా మాట్లాడటం... ఇది రాజకీయ సాంప్రదాయం అనుకోవాల్సిందే. మంత్రిగా అవకాశం ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పలేదు. ఈ రాజకీయాల్లో ఇమడలేకపోతే రాజీనామా చేస్తానని చెప్పాను. అది పత్రికల్లో మరోలా వచ్చింది.
ఎమ్మెల్యేగా కాకుండా జయసుధగా గడచిన పది నెలల పరిణామాలు ఎలా అనిపిస్తున్నాయి?
మొదటి నుంచి చూస్తున్నారు కదా.. జగన్‌కు మేం మద్దతు పలకడం. ఇప్పుడు కూడా దాంట్లో మార్పు లేదు. జయసుధగా ఉండటం ముఖ్యం.. రాజకీయాలు కాదు. వైఎస్ తీసుకొస్తేనే వచ్చాను. పార్టీ నుంచి జగన్ వెళ్లిపోతే ఆయనతోనే ఉంటాను.
జయప్రదతో మీ పోటీ ఎలా ఉండేది?
జయప్రద, శ్రీదేవిలా అందంగా ఉండాలని కోరుకోలేదు. కథ చెప్పేటప్పుడు మాత్రం ఇద్దరు హీరోయిన్లుంటే నా క్యారెక్టర్ చనిపోవాలని పట్టుబట్టే దాన్ని. అందరం స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం. నాకంటే వాళ్లు అందంగా ఉంటారు. అలాంటప్పుడు ఇంకెందుకు ఈర్ష్య? పద్మశ్రీ అవార్డు సైఫ్ అలీఖాన్‌కు ఇచ్చారు కదా... నేను ఇప్పుడు ప్రయత్నించవచ్చు. అయితే, కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిందనిపించుకోవడం ఇష్టం లేదు.
ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లలో ఎవరితో సౌలభ్యంగా ఉండేది?
నాగేశ్వరరావు గారితోనే. ఆయన చాలా సరదాగా ఉంటారు. చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. రామారావు గారి దగ్గరకొచ్చే సరికి అంతా భయపెట్టేసేవారు. అలాంటిది ఆయనకు క్రికెట్ పిచ్చి పట్టించాను. మన హీరోలతో ఎప్పుడు ఇబ్బందులు ఎదురుకాలేదు. ఇక్కడి హీరోలు చాలా మంచివారు. కమల్, నన్ను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేవారు. ఎక్కువ చిత్రాల్లో చేశాం. ఆ తర్వాత అంతా వదిలేశారు. రాజకీయాల కోసం సినిమాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. క్రీడలంటే నాకు ఇష్టం. నేను కోరుకోకుండానే చాలా జరిగాయి. టెన్నిస్ ఆడాలని ఉంది. కానీ, ఇప్పుడది కుదరదేమో..?!
మూడు దశాబ్దాలు తెలుగు రాకుం డా ఎలా రాణించగలిగారు?
నేర్పించడానికి ప్రయత్నించారు గానీ, రాలేదు. ఆ రోజుల్లో టీవీలు లేకపోవడంతో బతికిపోయాను. లేకపోతే నా గురించి చాలా తెలిసిపోయేది. డైలాగులు విని చెప్పడం అలవాటైపోయిందంతే... జ్యోతి చిత్రం తర్వాత వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండాపోయింది. సినిమాల్లో కూడా ముందు నాకు ఆసక్తి లేదు. మంచి పాత్రలు రావడం నా అదృష్టం. రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చేది.