
పెద్ద ఆవు పక్కన నిలబడిన ఈ చిన్న ఆవు పేరు స్వాలో. ఇది ఎంత చిన్న ఆవు అంటే గొర్రెకంటే తక్కువ ఎత్తులో ఉంటుంది. ఎత్తు కేవలం 33.5 అంగుళాలు (0.8 మీటర్). పదకొండేళ్ల ఈ ఆవు ఇప్పటికే తొమ్మిది దూడలకు జన్మనిచ్చింది. తాజాగా అతిచిన్న ఆవుగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. చాలా విషయాలు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కుతుంటాయి. అయితే, ఈ ఆవు మాత్రం గిన్నిస్ బుక్ ఎడిటర్ క్రెయిగ్ గ్లెండే మనసు దోచింది. తాజాగా నమోదైన మూడువేల గిన్నిస్ రికార్డుల్లో క్రెయిగ్‌ను ఈ విషయం బాగా ఆకట్టుకుందని బీబీసీ పేర్కొంది.
No comments:
Post a Comment