కొత్త మార్గాన్ని అన్వేషించటం లేక ఉన్న మార్గాన్ని మెరుగుపరచటం.. ఈ రెండే మనముందున్న దోవలు. జీవితంలో ఏదైనా సాధించి పైకి రావాలంటే.. ప్రతి విజేత గాధలో అంతర్లీనంగా ఉన్న సత్యమిదే. సాధిర్ అనే దేవదాసిల నృత్యాన్ని మెరుగుపరిచి భరతనాట్యమనే కొత్త నాట్యకళకు జీవం పోశారు రుక్మిణీ దేవి అరండేల్. నోబిన్ దాస్ నోరూరించే రసగుల్లాకు కొత్త జీవం పోసి దేశ విదేశాల్లో మనకో సరికొత్త అనుభూతికి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. అలాగే ఎందరో మహానుభావులు వాడుకలో ఉన్న కళలకి, వస్తువులను మెరుగుపరిచి తాము లాభపడ్డారు. మన జీవితాల్లోకి అనూహ్య అనుభూతులను తెచ్చారు.
ఎంఎస్ స్వామినాథన్, రైట్ బ్రదర్స్, నిర్మా కర్సన్‌భాయ్ పటేల్, హెన్రీ ఫోర్డ్, సర్ సివి రామన్, ఎడిసన్.. ఇలా ఎందరో అపర బ్రహ్మలు కొత్త మార్గాల్ని అన్వేషించి మానవ జీవనానికి కొత్త అర్థాన్ని, సరికొత్త రూపురేఖలనీ ఇచ్చారు. రెండు మార్గాలు ఉత్తమమైనవే... మన శక్తి సామర్థ్యాల పైన, ప్రజ్ఞాపాటవాల మీద ఆధారపడుంది మనకే దోవ మంచిదో అనే నిర్థారణ. నా దగ్గరకు ఎంతో మంది యువకులు వస్తుంటారు కొత్త కొత్త కలలు, గమ్యాలతో.. వీరిలో పెక్కు మంది సరికొత్త పథకాలతో, ఆలోచనలతో ఏదైనా కొత్త పుంత తొక్కాలంటే కేవలం ఒక కొత్త ఆలోచనే సరిపోదు.
ఈ ఆలోచనను లేదా ఉత్పాదనను అమల్లోకి తెచ్చి అది నలుగురికి తెలిసి ప్రాచుర్యం పొందేదాకా నిలబడగలిగే స్థోమత, ఓర్పు ఎంతో ముఖ్యం. ప్రతి కొత్త ఆలోచన, ఉత్పాదన ఉద్భవించాక అవి నిలబడి నాలుగు కాలాలపాటు జీవించి ఉండాలంటే పెట్టుబడులు అవసరం. నేను నా దగ్గరకు వచ్చే ప్రతి యువకుడికి చెప్తుంటాను కలల సాకారం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని అని. కొత్త మార్గాలు అన్వేషించి వాటిలో పయనం మొదలుపెట్టబోయే ముందు ఈ రెండు విషయాలు .. పెట్టుబడి.. అవి ఫలితాలనిచ్చే దాకా నిలబడగలిగే శక్తి సామర్థ్యాలు.
ఓర్పు.. మనకున్నాయా లేదా అనే విషయం మీద లోతుగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవటం ఎంతో ముఖ్యం. ఇక అమల్లో ఉన్న పద్దతులను, ఉత్పాదనలను మెరుగుపర్చాలన్నా, పెట్టుబడులు, ఓర్పు ఎంతో అవసరం. నిజానికి ఏ దోవ ఎంచుకున్నా ముందుగా ఆ రంగంలో నిష్ణాతుడిగా మారటం అన్నిటి కన్నా ముఖ్యం. ఈ రోజు మరో నిష్ణాతుడి గురించి ముచ్చటించుకుందాం. ఈయన మన ఆధునిక జీవితాన్ని సంపూర్ణంగా మార్చి వేసిన వ్యక్తి. అంతేకాదు తన అపారమైన ధనరాశిని ప్రపంచవ్యాప్తంగా లేమితో బాధపడే ప్రజానీకానికి పంచుతూ వారి జీవితాల్లో వెలుగులు, పెను మార్పు తెస్తున్న వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా ఈయన పేరు తెలియని యువతీ యువకులు ఎవరన్నా ఉంటారంటే ఆశ్చర్యపోవలసిన విషయమే.
వ్యాపారం, రాజకీయాలు, సంఘసేవ నేపథ్యాలుగా కలిగిన కుటుంబంలో జన్మించిన ఈ యువకుడు తన నేపథ్యానికి భిన్నంగా ఎంతో వైవిధ్యంగా ఆలోచించాడు. తన అసమాన ప్రతిభతో అనూహ్య పరిజ్ఞానంతో ప్రపంచ పోకడనే మార్చివేశాడు. ఆయన కృషివల్ల ప్రపంచం మాటతీరు మారింది. పనితీరు కొత్తదనాన్ని సంతరించుకొంది. సువిశాలమైన గ్లోబల్ విలేజ్‌గా రూపాంతరం చెందింది.
ఆయనే బిల్ గేట్స్.. బిల్ గేట్స్‌కు లెక్కలంటే చాలా ఇష్టం. స్కూల్లోని తెలివైన పిల్లల జాబితాలో ఆ కుర్రాడి పేరు ముందుండేది. ప్రపంచం చేసుకొన్న అదృష్టం కొద్ది ఆ అబ్బాయి అప్పట్లో తొలి దశలో ఉన్న కంప్యూటర్ వైపు ఆకర్షితుడయ్యాడు. అదేం విచిత్రమోకాని ఆ ఆక ర్షణ బిల్‌గేట్స్‌కి కంప్యూటర్‌కి ఒక విడదీయరాని బంధంగా ఏర్పడిపోయింది. అక్కణ్ణుంచి ఆ కుర్రాడు కంప్యూటర్ వదిలితే ఒట్టు !
బిల్‌గేట్స్‌కి అతని నేస్తం పాల్ అలెన్ తోడయ్యాడు. కంప్యూటర్‌ని చూస్తే చాలు ఇద్దరూ తమని తాము మర్చిపోయేవారు. ఫలితంగా స్కూలు పాఠాల మీద శ్రద్ధ తగ్గింది. టీచర్లు బోధించే విషయాలకంటే యంత్రం మౌనంగా వివరించే విషయాల మీద ఆసక్తి పెరిగింది. క్లాసులకు నామం పెట్టి కంప్యూటర్ రూమ్‌లో కాలక్షేపం చేస్తూ మిత్రులిద్దరూ తరచూ పట్టుబడేవారు. వారి ఆలోచనల్లో కంప్యూటర్.. అన్న పానాల్లో కంప్యూటర్, కలల్లో కంప్యూటర్.. అదో యంత్రం కాదు..తమకు మిత్రుడు, ఆత్మీయుడు. దాంతో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందరికన్నా తొందరగా వంటబట్టించుకున్నారు.
తమ భావి జీవితాలు కంప్యూటర్‌తోనే ముడిపడి ఉన్నాయని బాల్యంలోనే ఆకళింపు చేసుకున్నారు. ఇష్టమైన పని చేస్తుంటే ఇదే జరిగేది. సర్వకాల సర్వావస్తలయందు ఆ ఇష్టమైన పని మీదే ధ్యాస. ఫలితంగా ఆ రంగంలో కొద్ది కాలంలోనే ప్రావీణ్యత పొందుంతాం. ఇదే జరిగింది బిల్‌గేట్స్‌కి..పాల్ అలెన్‌కి. దీనికి తోడు అవకాశం కోసం ఎదురు చూసేవారికిఅది తలుపు తడుతుందనే సామెత నిజమైంది వీరిద్దరి విషయంలో. ఆ అవకాశం వీరి తలుపు తట్టింది. ఆ ఇద్దరు మిత్రులు హార్వర్డ్‌లో ఉన్నప్పుడు ఓ పత్రికలోని ప్రకటన వారిని ఆకర్షించింది.
ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్ కిట్ తన కమర్షియల్ మోడల్స్‌లో మార్పులు తీసుకు రాబోతుందని ఆ ప్రకటన సారాంశం. ఇంకేం బిల్, పాల్ ఎగిరి గంతేశారు. అవకాశాన్ని అందుకునేందుకు ముందుకొచ్చారు. కంప్యూటర్ కంపెనీకి ఫోన్‌చేసి తమ వద్ద ఓ ప్రోగ్రాం సిద్ధంగా ఉందని, ఆ కంప్యూటర్‌కి చక్కగా సరిపోతుందని చెప్పారు. నిజానికి ఉత్సాహమే తప్ప ప్రోగ్రాంలాంటిదేది వారి దగ్గర సిద్ధంగా లేదు. ఊరికే చీకట్లో రాయి విసిరారంతే. ఆ రాయి వెళ్లి సరిగ్గా తగలాల్సిన గురికే తగిలింది. ఫలితంగా వారి ప్రయత్నానికి అనుకూల స్పందన. కంపెనీ నుంచి పిలుపు వచ్చింది.
ఇద్దరు మిత్రులు కంప్యూటర్‌తో రెండు రోజులపాటు నిర్విరామంగా కుస్తీ పట్టారు. నిజానికి అలాంటి కంప్యూటర్ గాని లేదా ఆ తరహా చిప్‌కాని అంతకు మునుపు వారు చూడలేదు. సరికొత్త గుర్రాన్ని రౌతు మచ్చిక చేసుకొన్నట్టుగా ఆ కంప్యూటర్ స్వభావాన్ని వారు ఆకళింపు చేసుకొన్నారు. డెమో డే రానే వచ్చింది. మిత్రుల ఆదేశాల్ని తుచ తప్పకుండా పాటించిన కంప్యూటర్ వారి తొలి విజయానికి అంకురార్పణ చేసింది .అక్కడ నుంచి బిల్‌గేట్స్ విజయయాత్ర ప్రారంభమైంది.

- ఎజి కృష్ణమూర్తి
No comments:
Post a Comment