ఈ దేవాలయాన్ని చూస్తే.. ఓ మామూలు దేవాలయంగా కనపడుతుంది. ఆలయ గోపురానికి, ప్రాకారాలు కనీసం వెల్ల వేయకుండా ఉంటుంది. కేరళలో ఎంతో ప్రసిద్ధిగాంచినప్పటికీ.. ఇతర ప్రాంతాలకు ఆ దేవాలయం కొత్తే అని చెప్పాలి. అయితే ఆ దేవాలయం ఇప్పుడు ఓ నగల గని.. ఆభరణాల ఖజానా.. బంగారు కొండ.. నవరత్నాల నిలయం.. బంగారు ఆభరణాలు.. వజ్ర ఖచిత కిరీటాలు.. నవరత్నాలు పొదిగిన నగలు.. మరకత మాణిక్యాలు.. వజ్ర వెఢూర్యాలు.. రత్నాలు.. ఒకటా.. రెండా..!? ఒకదాని తర్వాత మరొకటి ఊహాతీతంగా బయట పడుతూనే ఉన్నాయి. దీంతో ఆ దేవాలయం ప్రపం చంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా వినుతికెక్కింది. ఆ దేవాలయమే.. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం.
లక్ష కోట్ల సంపద వెలుగుచూడడంతో.. పద్మనాభుడు ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తాడు. విష్ణురూపమైన ఆ స్వామి.. లక్ష్మీ కటాక్షంతో తులతూగు తున్నాడు. ఎంతలా అంటే.. శిరిడీ సాయినాథున్ని.. స్వర్ణదేవాలయ వెనక్కి నె ట్టేంతగా. ప్రపంచంలోనే ధనవంతుడైన కలియుగ దైవం వడ్డీకాసులవాడిని సైతం వెనక్కి నెట్టేంతంగా ఒకేసారి కోట్లకు పడగలెత్తాడు. ఇదీ.. కేరళ రాజ ధాని తరువనంతపురంలో కొలువై ఉన్న అనంత పద్మనాభుడి వైభవం. అనం త పద్మనాభ స్వామి దేవాలయం... ఇప్పుడు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల దేవాలయ నేలమాళిగల్లో లక్ష కోట్ల సంపద వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాల యం. దీంతో దశాబ్దాల తరబడి.. సంపన్న దేవాలయాలుగా వెలుగొందుతు న్న తిరుమల తిరుపతి దేవస్థానం, షిరిడీ సాయిబాబా సంస్థాన్, అమృత్‌సర్ లోని స్వర్ణదేవాలయాలు.. తమ అగ్రస్థానాలను చేజార్చుకున్నాయి.
రాష్ట్ర బడ్జెట్‌తో సమానం...
రాష్ట్ర బడ్జెట్‌తో సమానం...
పదిహేను రోజుల క్రిందట తొలిసారిగా వెలుగులోకి వచ్చిన అనతంత పద్మ నాభుడి సంపద.. వారం రోజుల పాటు లెక్కించగా.. లక్ష కోట్లకు చేరుకుం ది. ఈ నేపథ్యంలో.. ఈ ధనాన్ని ఏం చేస్తారన్న సందేహాలు ప్రజల్లో పొడసూ పడం సహజం. ఏకంగా మన రాష్ట్ర బడ్జెట్‌కు సమానమైన ఈ సంపదను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదరిక నిర్మూలనకు ఉపయోగించాలని కొం దరంటే.. ప్రభుత్వ హయాంలోకి ఈ సంపద వెళితే ఎక్కడికక్కడ దోచుకు తింటారనీ.. ఈ సంపద నంతా ఆలయ పాలకుల ఆధీనంలోనే ఉంచి ఆలయ అభివృద్ధికి ఉపయోగించాలని కొందరంటున్నా రు. కేంద్ర ప్రభుత్వ విద్యా బడ్జెట్‌కు సమానమైన ఈ సంపదను విద్యాభివృ ద్ధికి ఉపయోగించాలని మరికొందరు అంటున్నారు. హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్ష డు నారాయణ రావు మాత్రం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుం డా.. కొన్నాళ్లపాటు ఈ సంపదనంతా రాజవంశీకులు విధివిధానాలకనుగు ణంగానే ఈ మొత్తాన్ని ఆలయ సంపదగానే పరిగణంచాలని అన్నాడు.
ఎక్కడిదీ సంపద...
ఎక్కడిదీ సంపద...
శతాబ్దాల పాటు తాళం వేసిన ఉన్న దేవాలయ నేలమాళిగలను తెరిచి చూ డాలన్న సుప్రీం కోర్టు ఆదేశం మేరకు.. ఆ పని చేసిన ఆలయ సిబ్బందికి కళ్ళు బైర్లు కమ్మాయి. తీస్తున్న కొద్దీ అనంత ధనకనకరాశులు బయటపడ్డా యి. అరుదైన వజ్రాలు, పురాతన నాణేలు, కిరీటాలు, పచ్చలు ఎన్నో రాశుల కొద్ది బయటపడ్డాయి. దీంతో సుప్రసిద్ధ దేవాలయంగా వెలుగొందుతున్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒక్కసారిగా.. ప్రపంచ ఖ్యాతి పొందిం ది. సుప్రీం కోర్టు ప్రత్యేకంగా నియమించిన ఏడుగురు సభ్యుల కమిటీ గత నెల 27 నుండి వారం రోజుల పాటు లెక్కించి పద్మనాభుడి సంపదను లక్ష కోట్లుగా నిర్ధారించారు. వీటికున్న పురాతత్వ విలువను కూడా పరిగణలో కి తీసుకుంటే.. లక్ష కోట్లకు పదిరెట్లు పెరిగే అవకాశం ఉంది.
ఇక్కడికి ఎలా చేరింది...
ఇక్కడికి ఎలా చేరింది...
భారత్‌లో బ్రిటీష్ వారు విజృంభిస్తున్న రోజులవి. కాశ్మీర్ నుండి కన్యాకుమారీ వరకు అన్ని సంస్థానాలను.. నయానో బయానో మెప్పించి.. లేదంటే దాడి చేసి.. స్వాధీనపరుచుకుంటున్న బ్రిటీషర్ల కన్ను ట్రావెన్‌కోర్ సంస్థానం పై పడింది. అయితే.. సంస్థానాన్ని బ్రిటీ ష్ వారికి ఇవ్వడానికి ససేమిరా అన్న మహారాజా మార్తాండ వర్మ.. బ్రిటీషర్లతో యుద్ధానికి దిగాడు. వీరోచితంగా పోరాడినప్పటికీ.. బ్రిటీష్ వారి ఆధునాత యుద్ధ విద్య ముందు తలవంచక తప్పలే దు. ఈ నేపథ్యంలో తాను ఓడిపోతే.. సామ్రాజ్య సంపదనంతా దోచుకెళ్తారని భావించి.. సుంకాల ద్వారా వచ్చిన సంపదనం తా.. తాము ఆరాధ్య దైవంగా భావించే.. అనంత పద్మనా భుడి చెంత భద్రపరిచాడని చెబుతారు. అలా శతాబ్దాల క్రితమే ఆ సంపద పద్మనాభుడి పాదాల చెంత చేరింది.
దేవాలయంలో అసలు ఏం జరిగింది...
అనంత పద్మనాభుడి ఆలయ గార్భాలయాల్లో గుప్త నిధులున్నాయని చాలా మంది చెబుతుండేవారు. అయితే.. రాళ్ళతో మూసి ఉంచిన గదుల్లో కొన్నిం టి తిరిచి దాదాపు 150 సంవత్సరాలవుతోంది. 1860 ప్రాంతంలో ఈ నేల మాళిగలను మూసివేశారు. 1950 లో వీటికి పకడ్బందీగా సీల్ కూడా వేశా రు. స్వాతంత్య్రానంతంరం కేరళలోని ఆలయాలన్నింటినీ ట్రావెన్‌కోర్ దేవాల య బోర్డులో విలీనం చేసినప్పటికీ.. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని మాత్రం రాజకుటుంబీకులు తమ పర్యవేక్షణలోనే ఉంచుకున్నారు. ఆ కు టుంబానికి చెందిన చివరి రాజు చితిర తిరునాళ్ బలరామ వర్మను.. అప్పటి ప్రభుత్వం రాజప్రముఖ్ (గవర్నర్ హోదాతో సమాన హోదా) గా గుర్తించింది.

నేటికీ ట్రావెన్‌కోర్ రాజవంశానికి చెందిన కుటుంబ సభ్యులే ఆలయ ఆలనాపాలనా చూస్తూ.. ఆలయ ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 89 ఏళ్ళ ఉత్తర్ దామ్ తిరునాళ్ మార్తాండ ఆలయ ట్రస్టీగా కొనసాగుతు న్నాడు. అయితే.. ఇటీవల ఆలయ సంపద అస్తవ్యస్తంగా ఉందని, దీనిని గాడిలో పెట్టాలని టి.పి.సుందర రాజన్ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో సుప్రీం కోర్టు ఏడుగురు సభ్యుల కమిటీని నియమించి.. ఆలయ ఆస్తులను లెక్కించాల్సిందిగా ఆదేశించింది. అదిగో అప్పుడు బయటపడింది అనంతుడి అంతులేని సంపద.
శ్రీవారిని సైతం వెనక్కి నెట్టి...
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన వడ్డీకాసుల వాడు శ తాబ్దాలుగా తాను సంపాదించి సంపద.. ఇప్పుడు పద్మనాభుడి సంపదలతో మూడోవంతు కూడా లేదు. అధికారికంగా.. టీటీడీ సంపద 32 వేల కోట్లు ఉంటుందని చెబుతున్నా.. భద్రతా కారణాల వల్ల టీటీడీ అసలు సంఖ్యను బ యటపెట్టడంలేదు. అయితే అనధికార లెక్కల ప్రకారం శ్రీనివాసుడి సంపద యాభైవేల కోట్లు ఉండవచ్చని అంచానా.. అయినా ఇది పద్మనాభుడి సంపద లో సగం మాత్రమే. ఇక రెండు మూడు స్థానాల్లో ఉన్న షిరిడీ సాయి సంస్థాన్, అమృత్‌సర్ స్వర్ణదేవాలయం పద్మనాభుడితో పోటీ పడలేక చేతులెత్తాశాయి.
నేలమాళిగల్లో ఏం దొరికాయి..
వారం రోజుల పాటు లెక్కించిన సందలో.. 2000 రకాల కంఠాభరణాలు, 35 కిలోల బంగారు విగ్రహాలు, 16 శతాబ్దం, శ్రీ కృష్ణ దేవరాయల కాలం నాటి నాణేలు, ఈస్టిండియా కంపెనీ, నెపోలియన్ బోనాపార్టీ కాలాల నాటి నాణేలు సంచుల కొద్ది బయటపడ్డాయి. బంగారు గొలుసులు, బంగారు టెంకాలయలు, స్వర్ణ ఖంఖాలు ఇలా ఎంతో విలువైన వస్తువులెన్నో వెలుగు చూశాయి. నాణేలు భద్రపరిచిన సంచులు ఒక్కడి క్కడ పీలికలుగా మారి పోయినా.. నాణేలు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి.

ట్రావెన్‌కోర్ రాజు లకు ఆ నాణేలు సుంకాల కింద వచ్చి ఉండవచ్చునని, భద్రతా కారణాల రీత్యా వారు వీటినక్కడ భద్రపరిచి ఉండవచ్చునని పురవాస్తు శాఖ అధికారు లు చెబుతున్నారు. వీటితో పాటు విజయనగర సామ్రాజ్యానకి చెందినవి మరియు ఐరోపాకు చెందిన నాణేలు కూడా ఇక్కడ లభించాయి. ఈ గదు లకు తాళాలు వేసిన తీరు కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఎంతో క్లిష్టమైన రీతిలో ఉన్న ఆ తాళాలను తీయడానికి ఒక్కో తాళానికి ఆరుగంటల సమ యం పట్టిందట. మొత్తం ఆరు గదుల్లో తనిఖీలు చేసిన అధికారులు మాత్ర చివరి గదిని ఇంకా తెరువలేదు. కేరళ దేవాదాయ శాఖామంత్రి వి.ఎస్. శివ కుమార్ మాట్లాడుతూ... ఈ సంపదంతా.. ఆలయానికే చెందుతుందని తెలిపారు. అయితే చివరి గది తెరిచే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసు కోలేదని ఆయన అన్నాడు.
అప్పు 80 వేల కోట్లు, ఆస్తి లక్ష కోట్లు..
కేరళ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయ సంపద విలువ లక్ష కోట్ల రూ పాయలకు మించింది. ఇది ప్రభుత్వ రుణం కన్నా ఎక్కువ. కేరళ ప్రభుత్వం అప్పులు రూ. 70 వేల 969 కోట్లు ఉన్నాయి. ఈ సంపద విలువ మరింత పెరగవచ్చుని భావిస్తున్నారు. ఆలయ నేలమాళిగల్లోంచి తవ్వుతున్న కొద్దీ సంపద వెలువడుతోంది. ఆ విలువ కేవలం ఊహా మాత్రమేనని, ప్రాచీన కళాఖండాల విలును కచ్చితంగా నిర్ణయించలేమని భారత చారిత్రక పరిశోధనా మండలి మాజీ డైరెక్టర్ ఎంజిఎస్ నారాయణన్ అన్నారు. వాటి విలువ ను వెల్లడించడానికి సుప్రీంకోర్టు నిర్ణయించిన కమిటీ వెల్లడించడానికి నిరాకరిస్తోంది.
పూరీ జగన్నాథుడూ సంపన్నుడే...
గత ఫిబ్రవరి నెలలో జగన్నాథుడు కొలువై వున్న ప్రఖ్యాత పూరీ పుణ్యక్షేత్రంలో.. దాదాపు 90 కోట్ల విలువ చేసే 539 (సుమారు 18 టన్నులు) వెండి ఇటుకలు వెలుగుచూశాయి. ఈ ఏడాది పూరీ జగన్నాథ యాత్ర నేపథ్యం లో.. ఆలయంలో జరిగే దొంగతనాలను అరి కట్టేందుకు ఒడిశా పోలీసులు తనిఖీ నిర్వహిం చినప్పుడు ఈ వెండి ఇటుకలు బయపడ్డాయి. ఒక్కో ఇటుకు బరువు 40 నుండి 55 కిలోల వరకు ఉంటుంది.
చెక్క పెట్టల్లో భద్రపరిచిన ఈ ఇటుకలు.. పూరీ దేవాలయానికి.. 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమర్ మఠ్‌లో లభ్యమయ్యాయని.. పూరీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ అప్పట్లో వెల్ల డించారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో ఇద్దరు వ్యక్తులు రెండు వెండి ఇటుకలను దొం గిలించి అరెస్టైన నేపథ్యంలో.. ఒడిశా పోలీసు లు ఈ మఠంలో తనిఖీలు నిర్వహించారు. డిసెంబర్‌లో ఒడిశాలోని డెంకనాల్ నగరంలో ఓ తాపీమేస్ర్తీ.. పది కిలోల విలువ చేసే రెండు వెండి ఇటుకలను అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు అతన్ని విచారించగా.. పూరీలోని ఎమర్ మఠం నుండి దొంగి లించినట్టు తెలిపాడు.
అప్పు 80 వేల కోట్లు, ఆస్తి లక్ష కోట్లు..
కేరళ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయ సంపద విలువ లక్ష కోట్ల రూ పాయలకు మించింది. ఇది ప్రభుత్వ రుణం కన్నా ఎక్కువ. కేరళ ప్రభుత్వం అప్పులు రూ. 70 వేల 969 కోట్లు ఉన్నాయి. ఈ సంపద విలువ మరింత పెరగవచ్చుని భావిస్తున్నారు. ఆలయ నేలమాళిగల్లోంచి తవ్వుతున్న కొద్దీ సంపద వెలువడుతోంది. ఆ విలువ కేవలం ఊహా మాత్రమేనని, ప్రాచీన కళాఖండాల విలును కచ్చితంగా నిర్ణయించలేమని భారత చారిత్రక పరిశోధనా మండలి మాజీ డైరెక్టర్ ఎంజిఎస్ నారాయణన్ అన్నారు. వాటి విలువ ను వెల్లడించడానికి సుప్రీంకోర్టు నిర్ణయించిన కమిటీ వెల్లడించడానికి నిరాకరిస్తోంది.
పూరీ జగన్నాథుడూ సంపన్నుడే...
గత ఫిబ్రవరి నెలలో జగన్నాథుడు కొలువై వున్న ప్రఖ్యాత పూరీ పుణ్యక్షేత్రంలో.. దాదాపు 90 కోట్ల విలువ చేసే 539 (సుమారు 18 టన్నులు) వెండి ఇటుకలు వెలుగుచూశాయి. ఈ ఏడాది పూరీ జగన్నాథ యాత్ర నేపథ్యం లో.. ఆలయంలో జరిగే దొంగతనాలను అరి కట్టేందుకు ఒడిశా పోలీసులు తనిఖీ నిర్వహిం చినప్పుడు ఈ వెండి ఇటుకలు బయపడ్డాయి. ఒక్కో ఇటుకు బరువు 40 నుండి 55 కిలోల వరకు ఉంటుంది. చెక్క పెట్టల్లో భద్రపరిచిన ఈ ఇటుకలు.. పూరీ దేవాలయానికి.. 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమర్ మఠ్‌లో లభ్యమయ్యాయని.. పూరీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ అప్పట్లో వెల్ల డించారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో ఇద్దరు వ్యక్తులు రెండు వెండి ఇటుకలను దొం గిలించి అరెస్టైన నేపథ్యంలో.. ఒడిశా పోలీసు లు ఈ మఠంలో తనిఖీలు నిర్వహించారు. డిసెంబర్‌లో ఒడిశాలోని డెంకనాల్ నగరంలో ఓ తాపీమేస్ర్తీ.. పది కిలోల విలువ చేసే రెండు వెండి ఇటుకలను అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు అతన్ని విచారించగా.. పూరీలోని ఎమర్ మఠం నుండి దొంగి లించినట్టు తెలిపాడు.
అతను మరో వ్యక్తి కలిసి కొంతకాలం క్రితం ఎమర్ మఠంలో మర మ్మత్తు పనులు చేశారు. వీరు పనులు నిర్వహి స్తున్న సమయంలో.. ఓ రహస్య గది పై పెచ్చు ఊడి కిందపడింది. దీంతో కింద ఉన చెక్క పెట్టెలు పగిలి.. కొన్ని వెండి ఇటుకలు బయట పడ్డాయి. వాటినుండి కొన్నింటిని దొంగిలించి న వ్యక్తి.. ఆ ఇటుకలను విక్రయిస్తూ.. పోలీసు లకు చిక్కాడు. అతను చెప్పిన వివరాల ప్రకా రం పోలీసులు అదే రోజు రాత్రి మఠానికి వెళ్లి గుప్త నిధులు ఉన్న ఆ రహస్య గదికి తాళం వేశారు. మరుసటి రోజు ఉదయం.. మెజిస్ట్రే ట్, ఉన్నతాధికారుల సమక్షంలో.. గది తాళా లు తెరిచి చెక్కపెట్టెల్లోని ఇటుకలన్నీ బయటికి తీశారు. ఉదయం నుండి సాయంత్ర వరకు జరిపిన సోదాల్లో సుమారు 18 టన్నులు వెం డి ఇటుకలు బయటపడ్డాయనీ, కొన్ని వందల ఏళ్ళ క్రితం నుండే ఈ నిధి ఇక్కడ ఉందని తెలుస్తోందని దేవాదాయ కమిషనర్ సంజయ్ కేసర్ స్వయి అన్నారు.
మఠంలో మరికొన్ని చోట్ల గుప్త నిధులు ఉన్నాయేమోనన్న కోణంలో పోలీసులు తనిఖీ లు కొనసాగించారు. ఇటుకలపై ఉన్న గుర్తుల ఆధారంగా.. అవి బ్రిటీష్ కాలం నాటివని తేలింది. అయితే మఠంలో ఇంకా ఎంత గుప్త నిధి దాగివుందో అనేదానిపై ఇంకా పూర్తి వివ రాలు బయటకు రాలేదని పోలీసులు తెలిపా రు. మఠాధిపతి రామానుజ నారాయణ దాస్ మాట్లాడుతూ.. మఠంలో గుప్తనిధులు ఉన్నా యని పెద్దలు చెబుతుండేవారని, అవి ఇన్నా ళ్ళకు బయటపడ్డాయని అన్నాడు.
సంపదంతా స్వామిదే: కేరళ సీఎం
కాగా... అనంత పద్మనాభ స్వామి దేవాల యంలో బయటపడిన సంపద అంతా ఆల యానికే ఉంటుందని కేరళ ముఖ్యమంత్రి వూమెన్ చాందీ చెప్పారు. దాన్ని అక్కడే నిల్వ చేయనున్నట్లు ఆయన తెలిపారు. బయటకు వచ్చిన సంపదకు మతపరమైన, చారిత్రక ప్రత్యేకత ఉందని ఆయన అన్నారు.
దేవాలయ చరిత్ర...
పద్మనాభ స్వామి దేవస్థానానికి.. కొన్ని శతా బ్దాల చరిత్ర ఉంది. దక్షిణ భారతదేశంలో.. ప్రసిద్ధిగాంచిన రాజవంశం.. ట్రావెన్‌కోర్ సం స్ధానాధీశుల ఆధీనంలో ఉంది. ఎత్తువీటి పిల్ల మ్మార్‌గా పేరుగాంచిన ఎనిమిది శక్తివంతమైన కుంటుంబాలకు చెందిన నాయర్‌లు ఆలయ ఆలనాపాలనా చూసేవారు. తరువాత ఈ ఆల యం ట్రావెన్‌కోర్ సంస్థాన ఆధ్యుడైన మహారా జా మార్తాండవర్మ చేతుల్లోకి వెళ్లింది. వీరి ఆధీ నంలో పద్మనాభ స్వామి ఆలయం ఎంతో వృద్ధిగాంచింది. ఈ దేవాలయానికి పెద్దయెత్తు న మార్పులు చేయించింది కూడా రాజా మార్తాండవర్మ హయాంలోనే.

రాజామార్తాండ వర్మ.. తన ట్రావెన్‌కోర్ సంస్థానానికి పద్మనా భ స్వామిని కులదైవంగా ప్రకటించి సేవలం దించేవాడు. అంతేకాదు.. పద్మనాభ స్వామిని ట్రావెన్‌కోర్ సంస్థానాన్ని కాచే దైవంగా భావిం చేవాడు. ఈ నేపథ్యంలో.. తమకు తాము ‘పద్మనాభ దాస’ (పద్మనాభ స్వామి సేవకులు) గా ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా.. పద్మనాభస్వామి ‘వాలంపిరి శంఖు’ను తమ సంస్థానానికి చిహ్నంగా చేసుకున్నాడు. ఇప్పటీ కీ ఇది కేరళ ప్రభుత్వ అధికారికి చిహ్నంగా కొనసాగుతుండడం గమనార్హం. ఇక్కడ ప్రతి యేటా రెండు పెద్ద ఉత్సవాలు అత్యంత వైభ వంగా జరుగుతాయి. ఉత్సవాల సందర్భం గా.. పద్మనాభస్వామి, నరసింహ స్వామి, కృష్ణుడి విగ్రహాలను ‘శంఖుముగం బీచ్’లో గరుడవాహనం పై ఊరేగిస్తారు. ఈ ఉత్సవాన్ని ఆరట్టు అని పిలుస్తారు. ఈ ఉత్సవాలు జరిగే రోజుల్లో తిరువనంతపురం లో సెలవు దినాలు గా పాటించండం విశేషం.
విష్ణుమూర్తి అవతా రమైన అనంత పద్మనాభుడు శేషశైయనం పై పవళించినట్టుగా ఇక్కడి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని.. ఆయుర్వేద పదార్థాలైన కడు శక్కర యోగం తో తయారుచేశారు. శేషశ యనుడైన పద్మనాభుడి తల భాగం దక్షిణం వైపు.. తూర్పు ముఖంగా ఉంటుంది.ఈ దేవాలయం చరిత్ర గురించి ఇంకా లోతు గా పరిశీలిస్తే... 8వ శతాబ్దంలో తిరువనం తపురం ‘చిర సామ్రాజ్య’ ఏలుబడిలో ఉండేది. అల్వార్లు రచించిన పవిత్ర ‘దివ్య ప్రభంధ’ గ్రంథంలో ఈ దేవాలయ ప్రస్తావన ఉంది. గ్రంథంలో సూచించిన కేరళలోని 11 ‘దివ్య దేశా’లలో పద్మనాభస్వామి క్షేత్రం కూడా ఒక టి. అంతేకాకుండా.. బ్రహ్మ, వాయు, వరాహ, పద్మ పురాణాల్లో సైతం పద్మనాభుడి ప్రస్తావన ఉన్నట్టు చెబుతారు. 8వ శతాబ్దపు ప్రఖ్యాత కవి నమ్మళ్వార్ పద్మనాభుడిని స్తుతిస్తూ.. నాలుగు శ్లోకాలు, ఒక ఫలసృతి రచించాడు.
ఆలయ గోపురం...
ప్రస్తుత ఆలయ గోపురాన్ని 1566లో నిర్మిం చినట్టు చరిత్ర చెబుతోంది. ఈ గోపురం ఎత్తు వంద అడుగులు. దేవాలయం పక్కన పెద్ద కోనేరు ఉంటుంది. దీనిని ‘పద్మతీర్థం’ అంటా రు. ఈ దేవాలయం గ్రానైట్ పిల్లర్లతో చక్కని శిల్పకళానైపుణ్యంతో చెక్కబడి ఉంటుంది. 80 అడుగుల ఎతె్తైన ప్రకారం.. దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద మనకు గోచరిస్తుంది. గోపరం కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్‌ను నాటక శాల అంటారు. ఇందులో ఉత్సవాల (మీనం, తులం మాసాల్లో) సందర్భంగా కేరళ రాష్ట్ర నృత్యమైన కథాకళిని ప్రదర్శిస్తారు.
గర్భగుడి...
గర్భగుడిలో అనంత పద్మనాభుడి విగ్రహం.. ఆదిశేషుడిపై పవళించినట్లుగా ఉంటుంది. పద్మనాభుడు పైకి చూస్తూ.. తన ఎడమచేతి లో పద్మాన్ని పట్టుకొని ఉంటాడు. కాగా.. కుడి చేతివైపు శివుడు, శ్రీదేవి, భూదేవి లు కొలువై ఉంటారు. ఉదర భాగంలో ఉద్భవించిన పద్మంలో బ్రహ్మదేవుడు కొలువుదీరి ఉంటాడు. ఈ విగ్రహం 12 వేల శాలగ్రామాలతో మలచ బడి ఉంటుంది. ఈ శాలగ్రామాలను నేపాల్ లోని పవిత్ర నది గండకి నుండి తీసుకొచ్చిన ట్టుగా చెబుతారు. శాలగ్రామం పైన ఆయు ర్వేదానికి సంబంధించిన ‘కటుసర్కర యోగం’ ఉంటుంది.

ఇది విగ్రాహాన్ని పురుగులు పట ్టకుండా కాపాడుతుంది. అయితే.. అభిషేకానికి మూల విగ్రహాన్ని ఉపయోగించరు. కేవలం పుష్పాలతో అలంకరించి పూజిస్తారు. అభిషే కం కోసం ప్రత్యేకించి విగ్రహాలుంటాయి. ఈ పుష్పాలను ప్రతిరోజూ నెమలి ఫించాలతో తొలగించి కొత్త పుష్పాలను అలంకరిస్తారు. విగ్రహం పైనుండి కటు సర్కర తొలగిపోకుం డా ఉండేందుకు నెమలి ఫించాలతో మాత్రమే శుభ్రం చేస్తారు. పద్మనాభ స్వామి కొలువై ఉన్న ప్లాట్‌ఫాంను ‘ఒట్టక్కల్ మండపం’ అనే ఏకశిలలో నిర్మించారు. పద్మనాభుడికి పూజ చేయాలంటే.. ఈ ఒట్టక్కల్ మండపం పైకి ఎక్కాల్సివుంటుంది. ఈ విగ్రహం మనకు మూడు ప్రధాన ద్వారాల గుండా దర్శనమిస్తుంది.
స్వామివారి కుడిచేతి దిగువననున్న శివలిం గం వైపు ఒక ద్వారం, బ్రహ్మ, శ్రీదేవి, భూదేవి కొలువై ఉన్న దిశగా రెండో ద్వారం ఉంటుం ది. పద్మనాభుడి పాదాలవైపు మూడో ద్వారం ఉంటుంది. ఒకప్పుడు ట్రావెన్‌కోర్ రాజులు మాత్రమే ఒట్టక్కల్ మండపం పైకి చేరి స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసేవారు. ట్రావె న్‌కోర్ సంస్థానంలో రాజులను ‘పద్మనాభ దాసు’లుగా పిలిచేవారు. ట్రావెన్‌కోర్‌ను పరో క్షంగా పాలిస్తున్నది పద్మనాభుడే అని వారి నమ్మకం.
విశ్వవాప్తంగా ఉన్న 108 దివ్య దేశా ల్లో (విష్ణుమూర్తి క్షేత్రాలు) మూల విరాట్టు ఎక్కడైనా.. కూర్చుండి కానీ, నిలబడి గానీ, పవళించి గానీ ఉంటాడు. కానీ, ఇక్కడ ఆ 3 రూపాల్లో దర్శనం ఇవ్వడం అనంత పద్మనాభ స్వామి దేవాలయ ప్రత్యేకత. గర్భ గుడి నుండి చూస్తే.. పద్మనాభుడు ఆదిశేషుడి పై పవళించి నట్టుగా ఉంటుంది. అలాగే ప్రధాన ద్వారం నుండి చూస్తే.. విగ్రహం నిలబడినట్టు ఉం టుంది. కాగా.. ఉత్సవమూర్తిగా ఉన్న మరో విగ్రహం కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహాన్నే ఉత్సవాల్లో ఊరేగిస్తారు.
ప్రధాన మూర్తి అనంత పద్మనాభుడితో పాటు ఈ దేవాలయంలో నరసింహస్వామి, శ్రీకృష్ణు డు, అయ్యప్ప, గణపతి, ఆంజనేయుడు కూడా పూజలందుకుంటున్నారు. కాగా.. విశ్వక్సేన, శ్రీ గరుడు ఆలయ క్షేత్రపాలకులుగా పూజలం దుకుంటున్నారు. కొన్నేళ్ళ క్రితం వెలుగుచూసి న విషయం ఏమిటంటే.. కేవలం కటుసర్కర యోగంతోనే మలచబడి ఉందనుకున్న పద్మనా భస్వామి విగ్రహంలో బంగారం కూడా వాడిన ట్టు కనుగొన్నారు. ముఖం, ఉదర భాగం మిన హా మొత్తం బంగారంతో చేసినట్టు తెలిసింది.
పద్మనాభుడి అవతారం...
పద్మనాభుడికి సంబంధించి అనేక కథలు వా డుకలో ఉన్నాయి. ఒకప్పుడు దివాకర ముని అనే ముని శ్రీకృష్ణుడి దర్శనం కోసం తపస్సు చేశాడట. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక బాలుడి రూపంలో ఆ మునికి దర్శనమిచ్చాడట. ఆ బా లుడు పూజకోసం ఉంచిన శాలిగ్రామాన్ని తి న్నాడట. దీంతో ఆగ్రహించిన దివాకర ముని బాలుడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. పరుగుపరున వెళ్లి ఓ చెట్టు వెనకాల దాక్కున్నా డట. వెంటనే ఆ వృక్షం కుప్పకూలి విష్ణుమూ ర్తి అవతారంగా మారి అనంత శయన రూపం లో మునికి దర్శనమిచ్చిందట. అయితే ఊహించనంత ఎత్తుల స్వామి దర్శనమివ్వడం తో.. ఆశ్చర్యపోయిన ముని.. స్వామివారి భారీ కాయాన్ని తగ్గించని వేడుకున్నాడట.
దాంతో చిన్న రూపంలో దర్శనమిచ్చి.. తనను మూడు ద్వారాల గుండా పూజించాలని మునిని ఆదే శించాడట. ఆ మూడు ద్వారాల ద్వారానే ఇప్ప టికీ అనంత పద్మనాభ స్వామి భక్తులకు దర్శన మిస్తున్నాడు. మొదటి ద్వారంలో శివుడు, రెం డో ద్వారంలో బ్రహ్మ, మూడో ద్వారం ద్వారా విష్ణుమూర్తి పాదాలు దర్శనమివ్వడం విశేషం. ఒకానొకప్పుడు పద్మనాభ స్వామి దేవాలయం లో పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. దాం తో విష్ణు రూపంగా మునికి దర్శనమిచ్చిన వృ క్షం కాలిపోయింది. అప్పటి రాజుపై పద్మనాభు డి ఆగ్రహంగా ఈ సంఘటనను వర్ణిస్తారు.

ఏడు పరుశురామ క్షేత్రాల్లో అనంత పద్మనాభ దేవాలయం కూడా ఒకటని విశ్వసిస్తారు. అం తేకాకుండా.. స్కంద, పద్మ పురాణాల్లో కూడా పద్మనాభుడి ప్రస్తావన ఉందని చెబుతారు. దీనికి సంబంధించి.. దళితులైన పులయ వర్గా నికి చెంది న ఇద్దరు వ్యక్తులకు విష్ణుమూర్తి బా లుని రూపంలో దర్శనమిచ్చాడట. అప్పుడు వారి చేతిలో ఉన అన్నాన్ని విష్ణుమూర్తి తీసు కొని ఆరగించాడట. అప్పుడు వారిలో ఒకతను (ఈ కథలో కూడా ఇతడిని దివాకర మునిగా భావిస్తారు) బాలుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ఒక మామిడిపండును కొబ్బరి చిప్పలో ప్రసాదంగా పెట్టి పూజిస్తాడట. ఇప్ప టికి కూడా పద్మనాభస్వామి ఆలయంలో.. బియ్యంతో చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని కొబ్బ రిచిప్పలో పెట్టి స్వామికి నివేదించడం ఆనవాయితీగా వస్తుంది.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘జల్’ తుపాను సాధారణ తుపానుగా బలహీనపడినప్పటికీ తుపాను హెచ్చరికలు జిల్లా కు గత మూడు రోజులుగా రావడంతో అధికార యంత్రాంగం అన్ని ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేసినప్పటికీ జిల్లాలో చలి గాలులు, విద్యుద్ఘాతాలు, చెట్లు విరిగిన సంఘటనల్లో జిల్లా వ్యాప్తంగా 15 మంది మృతిచెందారు. అయితే కేవలం ఏడు మంది మాత్రమే మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని చెరువులు నిండిపోయి ప్రమాదపుటంచు ల్లో ఉన్నాయి. జిల్లాలోని అతిపెద్ద చెరువైన కనిగిరి రిజర్వాయ ర్ పూర్తిస్థాయి మట్టాన్ని దాటి నిండిపోయి ఉంది. ముఖ్యంగా ఈ తీరప్రాంత మండలాలైన ఇందుకూరుపేట, అల్లూరు, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాల్లో సముద్రపు నీరు తీరప్రాంత గ్రామాల్లోకి రావడంతో అధికారులు స్థాని కులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద సముద్రతీరప్రాంతం కలిగిన నెల్లూరు జిల్లాలో ఈ తుపా ను అలజడి ఎక్కువగా ఉంది. సముద్రపు అలలు రెండు నుం చి 4 నాలుగు మీటర్ల ఎత్తు వరకూ ఎగిసిపడుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ జల్ తుపాను ప్రభావం తూర్పుకు ఉండకపోవచ్చని అధికార వర్గాలు అంటున్నా.. జిల్లా లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం నుంచి జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు ఓ మోస్త రు నుంచి భారీగానే వర్షాలు నమోదయ్యాయి. ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లోనే తిరిగి తుపాను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లో ముసురు ప్రభావం ఉంది. వారం రోజుల పాటు నీటమునిగిన వరి చేలు జల్ తుపానుతో ఇబ్బందికరంగా మారాయి. కాకి నాడ పోర్టులో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసా గిస్తున్నారు. రేవులో ట్రాఫిక్‌ను సస్పెండ్ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వెళ్లకుం డా నిషేధా జ్ఞలు జారీ చేశారు. ఏ పాటి చిన్న తుపాను వచ్చిన ఉలిక్కిపడే ఉప్పాడ సముద్రం మరో పర్యాయం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉవ్వె త్తున రోడ్డుపైకి కెరటాలు చొచ్చుకొస్తున్నాయి.
జల్ తుఫాను వార్తలు కృష్ణాజిల్లాలోని తీర ప్రాంత గ్రామా ల్లో అలజడి సృష్టించాయి. సహజంగా అమావాస్య, పౌర్ణమి లకు సముద్రంలో ఆటుపోట్లు అధికంగా ఉండటంతో పాటు భారీ వర్షాల కారణంగా సముద్రంలో కలిసే డ్రైన్లలోని నీరు ఎదురు తన్నటంతో తీర ప్రాంత గ్రామాల్లో అక్కడక్కడ సముద్రపు నీరు గ్రామాన్ని తాకింది. కృత్తివెన్ను మండలం మల్లంపూడి గ్రామ సమీపంలోని పెదలంక డ్రైన్ పొంగటంతో ఓర్లగొందితిప్ప గ్రామం జలమయమైంది. అయితే సముద్రపు ఆటుపోట్లతో ఆదివారం నీళ్ళు వెనక్కు వెళ్ళిపోయాయి. అలాగే ఉప్పుటేరు, లజ్జబండ డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నీట మునిగిన వరి పొలాలు నేటికి నీరు లాగకపోవటంతో వరి కంకులు కుళ్ళి పోతున్నాయి. సముద్ర తీర ప్రాంత వాసులకు ఇది సహజమే అయినా జల్ తుఫాను వార్తలతో గత రెండ్రోజులుగా రెవిన్యూ శాఖ ఎప్పటికప్పుడు గ్రామస్థులను హెచ్చరిస్తూ పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది.
సముద్రతీరానికి సమీపంలో వున్న శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయుడు కండ్రిగ, వరద య్యపాళ్యం, సత్యవేడు మండలాల్లో తుఫాన్ తాకిడి అధికంగా వుంది. నిరుపేదలు నిర్మించుకున్న పూరిగుడిసెలు తుఫాను గాలికి ఎగిరిపోయాయి. గూడు లేక పేదలు రోడ్డుపై నిలిచారు. ఐదు చెరువులకు గండ్లు పడ్డాయి. వీటిని పూడ్చడానికి అధికా రులు ప్రయత్నిస్తున్నారు. పీలేరు వద్ద కొత్తచెరువు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో అధికారులు ముందస్తుగానే గండిని పూడ్చివేశారు. జిల్లాలోని శ్రీకాళహస్తి పరిధిలో లక్ష్మీపురం గిరిజన కాలనీ, చెంచులక్ష్మీ కాలని, ఈదలగుంట ప్రాంతాల్లో వాననీరు కాలనీల్లోకి చేరింది. దీంతో పేద గిరిజనులు సర్వం కోల్పోయి ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాళంగి, ఆరణియార్, కృష్టాపురం డ్యాంములు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కాళంగిలో పది గేట్లను ఎత్తివేసి నీటి ఉధృతిని తగ్గించారు. జిల్లా కలెక్టర్ శేషాద్రి, ప్రత్యేక అధికారి రావత్‌లు తూర్పు మండలాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన సహాయక చర్యలను చేపట్టడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఏకదాటిగా ఈదురగాలుతో కూడిన వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారికంగా 136 ఇండ్లు నేలమట్టమయ్యాయి.
కోస్తాంధ్ర ప్రజలను ఆందోళనకు గురిచేసిన జల్‌తుపాన్ ఉత్తరాంధ్రను కాస్త కనికరించింది. విశాఖ తుపాన్ కేంద్రం ముందస్తు హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో సఫలీకృతం కావడంతో ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు వాటిల్లలేదు. అయితే ఆదివారం నాడు కురిసిన కుండ పోత వర్షాలు, అలల ఉధృతి కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని బారువ-కొత్తూరు తీర ప్రాంతంలో పది అడుగుల మేర సముద్రం ముందుకు చొచ్చుకుపోయింది. అయితే ఈమూడు జిల్లాల్లోని వాతావరణం సాధారణ స్థాయికి చేరుకోవడంతో అనేక ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రం లోకి చేపల వేటకు వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో విజయనగరం జిల్లా , భోగాపురం మండలం, చింతపల్లి ప్రాంతానికి చెందిన మత్స్యకారులు చేపలవేట ముగించుకుని తిరుగుప్రయాణంలో పడవ ఇంజన్ మరమ్మతులకు గురికా వడంతో సముద్రంలో చిక్కుకుపోయారు. కోస్ట్ గార్డు సిబ్బంది వారిని రక్షించి ఒడ్డుకు చేర్చడంతో వారు ప్రాణపాయం నుంచి గట్టెక్కారు.
అదే విధం గా శ్రీకాకుళం జిల్లా బారువా-కొత్తూరు ప్రాంతానికి చెందిన మరో మత్స్యకారుడు బోటు పై నుంచి పడిన సంఘటన మిన హాయించి ఎలాంటి ప్రభావం కనిపించలేదని ఆ జిల్లా రెవి న్యూ అధికారులు తెలిపారు. ఈ తుపాన్ ప్రభావం మరో రెండు రోజులు కొనసాగే అవకాశాలు వున్న దృష్య్టా రణస్థలం, కంచి లి, టెక్కలి, పాతపట్నం తదితర ప్రాంతాల్లో సహాయక కేంద్రా లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు జిల్లాలోని సహాయక చర్యలపై నిత్యం అధికారు లతో ఫోన్ ద్వారా సమీక్షిస్తున్నారు. అదే విధం గా విజయన గరం జిల్లాకు చెందిన మంత్రి బొత్సా కూడా అదే స్థాయిలో జిల్లా పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులతో కలిసి సమీక్షిస్తు న్నారు. ఇక విశాఖజిల్లాలో జల్ తుపాన్ కార ణంగా పాయక రావుపేట మండలం, బంగారమ్మపేట వద్ద సముద్రపు అలలు పది అడుగుల మేర చొచ్చుకు వచ్చింది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలను స్థానిక ఎమ్మెల్యే ఆదేశా లతో సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. అదే విధంగా పూడిమడక ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ఐదుగురు సముద్రంలో చేపల వేటకు వెళ్లగా, వారు ఆదివారం తిరుగుముఖం పట్టిన నేపథ్యంలో వారు ప్రయా ణించే బోటు బోల్తా పడింది.
ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన పెను తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లోని పలు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు ఉధృతమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. 3000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు .ఆదివారం రాత్రికి తీరం దాటుతుం డటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు కాలం గడుపుతున్నారు. ఇప్పటికే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి కరికాల వళవన్‌తో పాటు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, ఎస్పీ నరసింహ రాజు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలో 75 లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఎటువంటి విపత్కర పరిస్థితిలోనైనా నష్టాన్ని నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాళ్లపాడు ప్రాజెక్టు అధికారులు మూడు గేట్లు ఎత్తి 1500 క్యూసెక్కుల వరద నీరు మన్నెరులోకి విడుదల చేశారు. 

కామన్‌వెల్త్ క్రీడలను పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన ‘కామన్‌వెల్త్ ఆన్ వీల్’ పోటీల్లో విస్మయానికి గురిచేసిన అంగవికలుల భరతనాట్య ప్రదర్శన.
పెద్ద ఆవు పక్కన నిలబడిన ఈ చిన్న ఆవు పేరు స్వాలో. ఇది ఎంత చిన్న ఆవు అంటే గొర్రెకంటే తక్కువ ఎత్తులో ఉంటుంది. ఎత్తు కేవలం 33.5 అంగుళాలు (0.8 మీటర్). పదకొండేళ్ల ఈ ఆవు ఇప్పటికే తొమ్మిది దూడలకు జన్మనిచ్చింది. తాజాగా అతిచిన్న ఆవుగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. చాలా విషయాలు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కుతుంటాయి. అయితే, ఈ ఆవు మాత్రం గిన్నిస్ బుక్ ఎడిటర్ క్రెయిగ్ గ్లెండే మనసు దోచింది. తాజాగా నమోదైన మూడువేల గిన్నిస్ రికార్డుల్లో క్రెయిగ్‌ను ఈ విషయం బాగా ఆకట్టుకుందని బీబీసీ పేర్కొంది.
విచిత్ర వేషధారణలో పొడవైన బూరలు ఊదుతూ కొనసాగుతున్న ఈ ఊరేగింపు మెక్సికోలోది. మెక్సికన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ వేడుక జరిగింది. ఇది మెక్సికన్లకు 200వ స్వాతంత్య్ర దినోత్సవం కావడం విశేషం. 1810 సంవత్సరానికి ముందు స్పెయిన్ పాలనలో ఉన్న మెక్సికన్లు సుమారు పదేళ్లు పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నారు.
సమస్య చూసే కోణాన్ని బట్టి పరిష్కారం ఉంటుంది. ఈ చిత్రం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని బురిగంగా నదిపై తీసినది. నదిని దాటడానికి బ్రిడ్జి లేకపోవడంతో అక్కడ పడవలు వాడేవారు. అయితే, గురప్రు డెక్క విపరీతంగా పెరిగిపోయి పడవ ప్రయాణానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో స్థానికులు ఇలా పడవలన్నింటినీ ఒకదానిపక్కన ఒకటి వేసి వంతెనలాగా తయారుచేసుకున్నారు. ఆలోచించాలే గాని పరిష్కారాలకు ఏం కొదవ చెప్పండి!
(సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్
కావలసిన పదార్థాలు